కామెడీయన్స్ సొంతంగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయడం.. వ్లాగ్స్ చేయడం.. వైరల్ అయ్యేందుకు రకరకాల థంబ్ నెయిల్స్ పెట్టి ఫేమస్ అవ్వడం ప్రస్తుతం కామన్ అయిపోయింది. రీసెంట్ గా ప్రియాంక జైన్-శివ్ కలిసి తిరుపతిలో చేసిన ఓ వ్లాగ్ వైరల్ అవ్వడం.. వారి మీద తీవ్రంగా ట్రోల్స్ అవ్వడం చూసాము.. ఇప్పుడు అదే తరహాలో యాదవరాజు.. అతడి భార్య కలిసి చేసిన ఓ వ్లాగ్ యూట్యూబ్ లో వైరల్ గా మారింది.
జబర్దస్త్ ద్వారా ఫేమ్ పొందినవారిలో యాదమ్మ రాజు ఒకడు. యాదమరాజు , స్టెల్లా లవ్ మ్యారేజ్ చేసుకోగా తాజాగా వారికి మగ బిడ్డను జన్మించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వీరిద్దరు షేర్ చేసుకున్నారు. ఈ మేరకు తమ యూట్యూబ్ ఛానెల్ లో ఒక వీడియోను పంచుకున్నారు.
యాదవరాజు భార్య స్టెల్లా తన ప్రసవ సమయంలో కొన్ని సమస్యలు వచ్చాయని ఈ వ్లాగ్ లో చెప్పుకొచ్చింది. నార్మల్ చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్తే ఉమ్మునీరు తగ్గిందన్నారు. త్వరగా ప్రసవం చేయాలన్నారు. దీంతో డాక్టర్ల సలహాతో ఒక ఇంజెక్షన్ తీసుకుని ఇంటికి వచ్చాను. ఆ తర్వాత ఇంకో డాక్టర్‌ను సంప్రదిస్తే ఇది చాలా ఎమర్జెన్సీ కేసు.. వెంటనే ఆస్పత్రిలో అడ్మిట్ అవ్వాలన్నారు. అప్పటికీ కూడా కడుపులో ఉన్న బిడ్డకు కూడా గ్యారెంటీ ఇవ్వలేమన్నారు. అప్పుడు యాదమ్మరాజును పట్టుకుని చాలా ఏడ్చాను. ఏం చేయాలో అర్థం కాక ఇంటికి వచ్చాం. మాకు తెలిసినవాళ్ల ద్వారా తర్వాతి రోజు గాంధీ ఆస్పత్రికి వెళ్తే ఉమ్మునీరు ఎక్కించారు. ఆ తర్వాత మరో ఆస్పత్రికి వెళ్లాం. నా పరిస్థితి క్లిష్టంగా ఉందన్నారు. అక్కడ కూడా బిడ్డ గురించి ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దన్నారు. ఈ కారణంగానే సీమంతం ఫంక్షన్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాం. డాక్టర్స్ చెప్పిన డెలివరీ డేట్ కంటే దాదాపు 15 రోజుల ముందే ప్రసవం జరిగింది. ప్రస్తుతం బేబీ ఆరోగ్యంగా ఉందని స్టెల్లా చెప్పుకొచ్చింది. ఇక యాదమరాజు, స్టెల్లా దంపతులకు సోషల్ మీడియాలో సెలెబ్రిటీలంతా అభినందనలు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.